సోమ‌రిపోతు ప్ర‌జ‌లు++?

సోమ‌రిపోతు ప్ర‌జ‌లు++?



సీఎం జ‌గ‌న్ అన‌వ‌స‌ర‌మైన ప‌థ‌కాలను ప్ర‌జ‌ల‌కు ఇచ్చి సోమ‌రిపోతుల‌ను (మీ భాష‌లో) చేస్తున్నాడ‌ని బాబు, చిన్న బాబు, బాబు క‌ళ్యాన్,  బాబు బ్యాచ్, మీడియా ప్ర‌చారం చేసుకున్నారు.  మ‌రీ ఇప్పుడు చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు జ‌గ‌న్ నెర‌వేర్చిన హామీల‌కంటే ఎంతో గోరంగా.. ఉన్నాయి క‌దా... అయితే కేవ‌లం అధికారం కోస‌మే ఈ హామీలు, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఈ హామీల‌ను తుంగ‌లో తొక్కేయాల‌నుకుంటున్నారా.. అలా అయితే ప‌ర్వాలేదు.  

లేక ఇచ్చిన మాట మీద జ‌గ‌న్ మాదిరిగా నిల‌బ‌డి హామీల‌ను నెర‌వేరిస్తే  అప్పుడు ప్ర‌జ‌లు ఇప్ప‌టిక‌న్నా సోమ‌రిపోతులు(మీ భాష‌లో)  అవుతారు క‌దా.. 

మ‌హానాడుకి 15 వేల మందికి బ‌దులు ల‌క్షా 50 వేల‌మంది వ‌చ్చారు?
ఒక్క‌రిని పిలిస్తే 7 లేదా 8 మంది వ‌చ్చే స్థాయిలో మేము ఉన్నామ‌ని స్వ‌యంగా బాబు గారే ప్ర‌క‌టించుకున్నారు.  అలా ఉన్న‌ప్పుడు ఈ హామీలు ఇంకెందుకు.  ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌స్తే అతిభారీ మెజారిటితో గెలుస్తామ‌న్న ధీమా ఉందిక‌దా.. అలాంట‌ప్పుడు ఈ హామీలు ఇవ్వ‌డం ఎందుకు.. ఎన్నిక‌ల్లో మీ విశ్వాసం నిరూపించుకుంటే స‌రిపోతుంది క‌దా..

సో.. బాబు గారూ ఏది చెప్పిన కొంచెం క్లారిటీగా చెప్పండీ.. ఎందుకంటే మీ, మ‌న‌ చిన్న బాబుకి ఉన్నంత తెలివి తేట‌లు మాకు లేవు..

Comments

Popular posts from this blog

Defending Against Dengue: Symptoms, Precautions, and Prevention

Is eating meat good for health? Let's know the Pros and Cons..?

Heart Health is wealth: 6 Points for Prevention