అబద్దాన్ని 100 సార్లు చెబితే నిజం అవుతుంది..!
100 ఆపద్దాల్లో ఇది 1
CM జగన్ ప్రజలకు అనవసం అయినా పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నాడు. AP ని మరో శ్రీలంక లాగా మారుస్తున్నాడు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారుతుంది, మొత్తం దివాలా తీస్తుంది. అని మన పిరమైన నాయకులు చంద్ర బాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు ఈ ముగ్గురు బాబులు గత 4.5 ఏళ్ళు ఏడ్చి మొట్టుకున్నారు.
కట్ చేస్తే ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో విచ్చలవిడిగా హద్దు పద్దు లేకుండా హామీలు ఇస్తున్నారు. అవి ఏంటంటే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలకు మూడు రెట్లు కలిపి ఇస్తామని హామీ ఇస్తున్నారు.
100 ఆపద్దాల్లో ఇది 2
అలా అయితే జగన్ 1/3 పథకాలు ఇస్తుంటే ఒక శ్రీలంక రాష్ట్రం లాగా దివాలా తీస్తుందని అన్నారు కదా అప్పుడు మరి ఇప్పుడు ఇస్తున్న దానికంటే మూడు రెట్లు ఎక్కువగా పథకాలు ఇస్తామని హామీ ఇస్తున్నారే.. మరి ఇప్పుడే ఏ దేశం లాగా కావాలి, మరి ఎంత దివాలా తీయాలి.
అయితే గతంలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలా.. లేకపోతే ఇప్పుడు చెప్పేవి సొల్లు మాటలా.. ఈ రెండింటిలో ఏది నిజం. జనం ఏది నమ్మాలి. అసలు మిమ్మల్ని నమ్మాలా వద్దా అన్న అనుమానాలు జనాలకు రావు అనుకుంటున్నారా...! రాలేవు అనుకుంటున్నారా...?
ఒకప్పుడు వాలంటీర్లను అన్న మాటలు అన్ని ఇన్ని కాదు. కళ్యాణ్ బాబు అయితే ఏకంగా ఆడవాళ్ల వివరాలు సేకరించి ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ ఇప్పుడు అదే వాలంటీర్లను కొనసాగిస్తాం... ఉద్యోగ భరోసా ఇస్తాం... జీతాలు పెంచుతాం... నైపుణ్యాలు పెంచుతాం... అని వాలంటీర్లకు హామీలు ఇస్తున్నారు. ఈ మాటల మూటలన్నింటినీ వాలంటీర్లు అసలు నమ్ముతారా అన్న డౌట్ అయినా మీకు రావాలి గా... రాదు.... ఎందుకు వస్తది. అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలనుకుంటే నిజమవుతదా.... అబద్ధం అబద్దమే... నిజం నిజమే. నిజం ఎక్కడ పెట్టినా నిప్పులాగా బయటకు వస్తది.
ఇప్పటికీ అయినా మీరు సూపర్ 6 హామీలను ఎలా నెరవేరుస్తారు ఒక్కసారి వివరించండి. జగన్ లాగే మీరు కూడా అప్పులు తీసి ఇస్తారా... లేకపోతే ఇవ్వరా..
100 ఆపద్దాల్లో ఇది 3
అయితే అందరితోపాటు నాకూ ఒకటి డౌటు ఉంది. ఏంటంటే గతంలోనూ చంద్రబాబు ఇలాగే చాలా హామీలు ఇచ్చాడు ఎన్నికలు గెలిచాడు. అయితే గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడానికి ఎలా వీలవుతుందని అన్నాడు. ఇప్పుడు కూడా ఒకవేళ గెలిస్తే అదే పాత సామెత చెబుతాడని డౌటు ఉంది. ఓటరన్నా జర జాగ్రత్త...!
Comments
Post a Comment