మికోసమా...? జనం కోసమా..?
ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ ప్రజాగళం రోడ్ షో మొత్తానికి అటు ఇటుగానే ముగిసింది.
పవన్ కళ్యాణ్ అన్నకి బాగా అర్థం అయ్యిందేమో... ఈ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అని.. అందుకే పర్ఫామెన్స్ చేయలేకపోతున్నారు. పాపం ఈ ఇద్దరి రాజకీయ పండితుల మధ్య ఇమడలేకపోతున్నాడు.
ఇక మోడీ గురించి చెప్పాలంటే... ఏది ఏమైనా తన PM పదవికి ఎలాంటి లోటూ లేదని బాగా తెలుసు... AP లో కాకపోతే చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది. ఇక్కడ just ఒక రాయి వేస్తున్నారు BJP వాళ్ళు. ఈ విషయం నాకంటే.. మనకంటే AP BJP వాళ్ళకి, TDP వాళ్ళకి, సేన వాళ్ళకి భాగా తెలుసు..
ఇక CBN గురించి చెప్పాలంటే.. తను అప్పుడే CM అయిపోయాను అని అనుకుంటున్నారు. తన బ్రమను ఓటర్లకు కూడా ఎక్కించడానికి భాగా శ్రమిస్తున్నారు. ఈసారి ఏం చేసి అయినా.. ఏం చెప్పి అయినా.. ఎవరితో కలిసి అయినా.. అధికారం పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల రక్షణ కోసం నన్ను కాదు కాదు మమ్మల్ని గెలిపించండని అంటున్నారు.. కానీ.... ఈ పెద్ద మనిషిని చూస్తుంటే.. కేవలం ఆయన అధికారం కోసమే అన్నట్లు నాతో పాటుగా ఓటర్లందరికి అనిపిస్తోంది.
Ok ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం...
1. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ కి ఒక్క MLA పదవికి తక్కువ అయ్యిందా.. అసలు గెలిచి.. ఏం చేద్దామని అనుకుంటున్నాడు. సరే గెలిచాడు.. ok కూటమి అధికారం లోకి వచ్చింది.. అయినా నువ్వు ప్రజలకు మంచి చేసేవదివి.. కదా ఆ మంచి నిన్ను బాబు ఎలా చేయనిస్తాడు.. నికి మంచి పేరు వస్తే మరి చిన్న బాబు, పెద్ద బాబు పరిస్థితి ఏంటి కళ్యాణ్ అన్నా....
2. బాబులు ఇద్దరూ ఈసారి అధికారం రాకపోతే వాళ్ళ ప్రాణం పోతుంది అనేలా తయారయ్యారు.. ఎందుకు... ఇక్కడ అధికారం ప్రజల కోసమా...? మికోసమా...?
ఏంటో ఈ రాజకీయాలు... ఓటరు అన్నలరా.. మీరు కొట్టుకోవద్దు... మీకు కావాల్సిన నాయకుడికి ఓటు కొట్టండి.. అంతే... మీకు కుటుంబాలు ఉంటాయి.. వాళ్లకు మీ అవసరం చాలా ఉంటుంది.. మీ నాయకుడికి నీ అవసరం అంత ఉండదు..
Comments
Post a Comment